డిప్యూటీ కలెక్టర్ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

jyoమహారాష్ట్రలో శివసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఓ డిప్యూటీ కలెక్టర్‌ పై చేయిచేసుకున్నాడు. నాగ్‌పూర్‌ లో ఓ ప్రాజెక్ట్ కు సంబంధించి భూ నిర్వాసితులకు పరిహారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంఘటన జరిగింది. బాధితులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే సురేష్‌ లాడ్‌…డిప్యూటీ కలెక్టర్‌ అభయ్‌ కల్‌ గుద్కర్‌పై చేయి చేసుకున్నారు. విధుల్లో ఉన్న ఎమ్మెల్యేపై దాడి చేసినప్పటికి అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.