డీలర్లతో మంత్రి ప్రత్తిపాటి చర్చలు

విజయవాడ,జూన్‌4(జ‌నం సాక్షి ): చంద్రన్న విలేజ్‌ మాల్స్‌పై రేషన్‌ డీలర్ల ప్రతినిధులతో మంత్రి పుల్లారావు చర్చలు జరిపారు. ప్రతి నెల రేషన్‌ డీలర్ల ప్రతినిధులతో సవిూక్ష చేస్తామని, నెలాఖరులోగా 171 చంద్రన్న మాల్స్‌ ప్రారంభిస్తామన్నారు. స్పిల్ట్‌ కార్డులను జూలై నాటికి అందజేస్తామని, ఈనెల నుంచి తెల్లకార్డుదారులకు 2కేజీల కందిపప్పు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. జూన్‌ 11 నుంచి 17 వరకు 12.50లక్షల కుటుంబాలకు రంజాన్‌ తోఫా ఇస్తామని, కొత్తగా 2.42 లక్షల రేషన్‌ కార్డులు అందజేస్తామని పుల్లారావు చెప్పారు.