Wednesday, 4 November 2026

డెంగీతో మనమడు మరణించాడని తాత, తమ్ముడి మృతి

నెల్లూరు, సెప్టెంబరు 10 : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రమేష్‌రెడ్డి (30) డెంగీ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మనమడు మరణించాడని తెలిసిన తాత పెంచల్‌రెడ్డి తట్టుకోలేక కుప్పకూలిపోయి మరణించాడు. తన అన్న పెంచల్‌రెడ్డి మరణించాడనే మనస్థాపం చెందిన అతని తమ్ముడు చంద్రారెడ్డి కూడా గుండెపోటుతో మరణించాడు. మనమడు అంటే ఎంతో ప్రేమగా చూసే తాతలు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఉమ్మడి కుటుంబంలో ప్రేమలు ఎలా ఉంటాయో ఈ వరుస మరణాలను చూస్తే విదితమవుతుంది. ఈ సంఘటనతో మడపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *