– దాడులకు భయపడం: ఆజాం అలీ
– కాంగ్రెస్ నేత షబ్బీర్‌పైన దాడి
– పాతబస్తీలో మజ్లీస్ వీరంగం
హైదరాబాద్,ఫిబ్రవరి 2(జనంసాక్షి): గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పాతబస్తీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేర్వేరను ఘటనలో ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపైనా, అధికార పార్టీకి చెందిన డిప్యూటి సిఎం మహ్మూద్ అలీ ఇంటిపైనా దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతపై దాడితో పాతబస్తీలోని విూర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం కార్యకర్తలతో వాగ్వాదం ఘటనలో పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విూర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. గౌస్‌ను విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిపై స్పందించిన ఈసీ గౌస్ విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. విడుదలైన గౌస్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీసుకుని వెళ్తున్న సమయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు నినాదాలు చేశారు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఎంఐఎం కార్యకర్తలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో కారు ధ్వంసం అయ్యింది. ఇదే దశలో ఓ ఎంపైఎం కార్యకర్త కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని కారులోనే పిడిగుద్దులు గు/-దాడు. కారు డోరు తసీఇ దాడికి తెగించారు. దీంతో ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. మహ్మద్ గౌస్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచినప్పటి నుంచి పురానాపూల్‌లో వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎంఐఎం పార్టీ నేత అయిన మహ్మద్ గౌస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిక్కెట్ రానందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. ఇదిలావుంటే అజంపురలోని తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ నివాసం వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగారు. నివాసం వద్ద ఉన్న ఆయన తనయుడు అజం అలీపై ఎమ్మెల్యే బలాల దాడికి యత్నించారు. దీంతో బలాల తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి యత్నించిన ఎమ్మెల్యే బలాలను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మహముద్ అలీ కుటుంబాన్ని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ను చూసి ఎంఐఎం భయపడుతోందని, అందుకే దాడికి ప్రయత్నించిందని డిప్యూటీ సీఎం తనయుడు అజం అలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ పోలింగ్‌లో నమోదైన ఓటింగ్ శాతం చూసి ఎంఐఎం వాళ్లకు టెన్షన్ పుట్టిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తన నివాసంపై ఎంఐఎం కార్యకర్తల దాడి
నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎంఐఎం వాళ్లకు టెన్షన్ పుట్టడంతో తమపై దాడి చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరుగడం దారుణమని అన్నారు.
దాడిని ఖండించిన జానా
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలపై దాడిని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఖండించారు. ఈ దాడిలో పార్టీ నేత షబ్బీర్ అలీకి గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్దతులు తగవని ఆయన హితవు పలికారు. ఈ సంఘటనపై సీఎం స్పందించాలని ఆయన కోరారు. పాతబస్తీలో ఎంఐఎంతో కలసి అధిక్‌ఆర పార్టీ దాడులకు దిగిందని మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఇది దారుణమని అన్నారు. పాతబస్తీ తమయ జాగీరని అనుకుంటున్నారని అన్నారు.
డీజీపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆందోళన
ల్గ/దరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పాతబస్తీలో జరిగిన ఘటనలో ఎంఐఎం కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. గాంధీభవన్ నుంచి నల్లజెండాలు ధరించి డీజీపీ కార్యాలయానికి చేరుకున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానం నాగేందర్ సహా పలువురు నేతలు కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలపై దాడిని ఖండిస్తున్నాం: ఎర్రబెల్లి
గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెరాస అండతోనే పాతబస్తీలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై ఎంపీ అసదుద్దీన్ ఆధ్వర్యంలో దాడి చేయడం దారుణమైన విషయమన్నారు.ఈ దాడిపై దృష్టి మరల్చేందుకే ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపై దాడి చేసినట్లు నాటకమాడారని ఆరోపించారు. పోలింగ్ బూత్‌ల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారన్నారు. గ్రేటర్ పీఠాన్ని ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతోనే తెరాస దాడులకు పాల్పడిందని ఆరోపించారు. హైదరాబాద్‌ను నాశనం చేయాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ ఎంఐఎంతో జతకట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడిని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టం
హైదరాబాద్ పాతబస్తీలోని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసంపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. మహమూద్ అలీ ఇంటిపై ఎంఐఎం ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో కలిసి దాడి చేసిన విషయం తెలుసుకుని నాయిని అక్కడికి వెళ్లారు. మహమూద్ అలీని, ఆయన కుమారుడు అజం అలీని పరామర్శించారు. ఘటనకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని, దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షిస్తామని నాయిని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం చూసి ఎంఐఎం వాళ్లకు టెన్షన్ పుట్టిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. అందుకే తమపై దాడి చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు.





