Tuesday, 3 November 2026

డొనాల్డ్‌ ట్రంప్‌ ముందంజ

1

– ముందస్తు సర్వేలు

వాషింగ్టన్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసి తమ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన నెవెడా ప్రైమరీలో తన ప్రత్యర్థులు టెడ్‌ క్రూజ్‌, మార్కో రూబియోలపై పైచేయి సాధించారు. 42 శాతం పైగా ఓట్లతో విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ ముందున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. నెవేడాలో విజయంతో మార్చి 1న జరగనున్న ‘సూపర్‌ ట్యూజ్‌ డే’ పోటీకి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమయ్యారు. న్యూ హాంప్‌ షైర్‌, సౌత్‌ కరోలినా ప్రైమరీల్లో అంతకుముందు ఆయన గెలుపొందారు. అయొవాలో రెండో స్థానంలో నిలిచారు. డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్‌, బెర్నీ సాండర్స్‌ పోటీ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *