ఢిల్లీ ఏపీభవన్ సాక్షిగా..
చంద్రబాబుపై కుట్ర
ఢిల్లీలో వైసీపీ, బీజేపీ నేతల సమావేశమే నిదర్శనం
బీజేపీ కుట్రను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం
విజయసాయిరెడ్డి రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడు
టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్
గుంటూరు, జూన్15(జనం సాక్షి ) : వైసీపీ, బీజేపీ కుట్ర రాజకీయాలకు ఢిల్లీలో సమావేశం నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఏపీభవన్ సాక్షిగా చంద్రబాబుపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. జగన్పై ఉన్న కేసుల మాఫీకి కేంద్రం హావిూ ఇచ్చిందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున వైసీపీ ప్రచారం చేసిందని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి రాక్షస సైన్యానికి శుక్రాచార్యుడని డొక్కా వ్యాఖ్యానించారు. బీజేపీ కుట్రలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. నాలుగేళ్లలో కేంద్రం చేసిన ఒక్క మంచి పనిలేదని దుయ్యబట్టారు. అటు కడప ఉక్కు పరిశ్రమపై వైసీపీ ఎందుకు నోరుమెదపడం లేదని డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. కడప ఉక్కు పరిశ్రమకోసం తెదేపా ఓ పక్క పోరాటం చేస్తుంటే వైసీపీ నేతలు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన సొంత జిల్లా కోసం కూడా ఆలోచించటం లేదని.. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తాడని ప్రజలు భావించటం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ తెదేపానే గెలుస్తుందని, వైసీపీ, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, 18గంటలు ఏకదాటిగా కష్టపడుతూ రాష్ట్రాభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక సీఎం చంద్రబాబేనన్నారు. జగన్ కేవలం తన కేసుల నుండి బయటపడి, అక్రమ సొమ్మును మరింత కూడగట్టుకొనేందుకు అధికార పీఠం ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడని డొక్కా మండిపడ్డాడు.