డీజీల్‌పై 84పైసలు, పెట్రోల్‌పై 91పైసలు
న్యూఢిల్లీ, నవంబర్ 30 (జనంసాక్షి) : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. డీజిల్‌పై 84పైసలు, పెట్రోల్‌పై 91పైసలు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఎనిమిదోసారి, డీజిల్‌పై నాల్గోసారి తగ్గించనట్లయ్యింది. ఈ నవంబర్ మొదట్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.41పైసలు తగ్గగా, డీజిల్‌పై లీటర్ కు రూ.2.21 తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, ప్రతి 15 రోజులకు రేట్లు సవిూక్షించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు మరోసారి డీజిల్, పెట్రోల్ రేట్లను సవరించాయి. ఈ తాజా సవరణతో పెట్రోల్ పై మొత్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రూ.10.27 పైసలు తగ్గినట్లయ్యింది. ఇప్పటికే పలుమార్లు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పెట్రో ధరలు తగ్గాయని చెప్పుకుంటున్న బిజెపి మరోసారి అదే విధంగా డాంబికాలు పలికే అకాశం ఉంది. కానీ వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పుల కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి తప్ప కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇందులో ఏమాత్రం లేదు. అయినా అధికార పార్టీ నాయకులు ఇది తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నిస్తుండడం విడ్డూరం.





