Monday, 2 November 2026

నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆయుధాలు అవసరముండదు

 

5

డీజీపీల సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ

 

అసోం, నవంబర్‌ 30 (జనంసాక్షి) : దేశంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆయుధాలు అవసరముండదని ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. డీజీపీల సమావేశంలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. గౌహతిలో రెండో రోజు అన్ని రాష్గాల డీజీపీల సమావేశం కొనసాగుతోంది. ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్థుల అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. రెండు రోజులుగా గౌహతిలో కొనసాగుతున్న ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించి కీలక అంశాలను చర్చిస్తున్నారు. ఉగ్రవాదం, చొరబాట్లను అరికట్టడంపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక 33 వేలమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నిఘా వ్యవస్థ కీలకమైనది పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు పాల్గొన్నారు. సినీరంగం.. సామాన్యుల దృష్టిలో పోలీసుల పట్ల చెడు అభిప్రాయం కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సినీ ప్రముఖలతో సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల త్యాగాల గురించి తెలియజేస్తామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చాక విధి నిర్వహణలో 33 వేలమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. భద్రత వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండవచ్చని, మంచిని వదిలి చెడు గురించే ఎక్కువగా ప్రచారం తగదని సినీరంగానికి సూచించారు. కొందరు భారతీయ యువజనులు ఇరాక్‌, సిరియాల్లో వూపిరి పోసుకున్న తీవ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్‌’ పట్ల ఆకర్షితులవడాన్ని అంతతేలిగ్గా తీసుకోరాదనీ అన్నారు. భారత ఉపఖండం కోసం ప్రత్యేకంగా ‘ఖేదా ఉల్‌ జిహాద్‌’ పేరిట ఒక శాఖను ఏర్పాటు చేస్తామన్న అల్‌ఖైదా ప్రకటన మాట్లాడారు. అల్‌ఖైదా కుట్రలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదన్నారు. భారత్‌ ముస్లింలలో అత్యధికులను తమవైపు ఆకర్షించేందుకు విదేశీ తీవ్రవాద సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *