Tuesday, 3 November 2026

తదుపరి సిఎస్‌గా పునేఠా?

అమరావతి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో1984 బ్యాచ్‌కు చెందిన తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్‌చంద్ర పునేఠ ను నియమించే అవకాశాలు ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర సర్వీసులో ఉన్న మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రమేష్‌ పేరూ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్‌చంద్ర పేరూ సీఎస్‌ పదవికి పరిశీలనలో ఉన్నా.. ఆయనను ప్రస్తుత విధుల్లోనే కొనసాగించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.