Tuesday, 3 November 2026

తాగునీటి సమస్యుంటే చెప్పండి

చిత్తూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే సంబంధిత సర్పంచి, గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని గ్రావిూణ నీటిసరఫరా విభాగం అధికారులు కోరారు. ఎంత ఖర్చయినా ఎంత దూరమైనా తాగునీరు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని  వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో తాగునీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో ముందస్తుగా రూ.3.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. పుంగనూరు, చౌడేప్లలె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో అదనపు బోర్లు, పైపులైన్లు వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 116 గ్రామాలకు ట్యాంకర్లుతో తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మార్చి ఒకటి నుంచి ట్యాంకర్ల యజమానులకు ట్రిప్పునకు రూ.375లు నుంచి రూ.430లకు పెంచడం జరుగుతుందని వెల్లడించారు. అదే 10 కిలోవిూటర్లు పైబడితే ట్రిప్పునకు రూ.500లు ఇస్తామని చెప్పారు. గతంలో రైతుల బోర్లను దత్తత తీసుకుని రోజుకు రూ.200లు ఇచ్చేవారమని, ఈ మొత్తాని రూ.300లకు పెంచడం జరిగిందని అన్నారు. బోర్ల డ్రిల్లింగ్‌ ధరను కూడా పెంచామని చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలోని 36 గ్రామాల్లో రైతుల బోర్లను దత్తత తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలావుంటే అభయహస్తం పథకంలో లబ్దిదారులుగా ఉన్న అసంఘటిత కార్మికులు, నిరుపేదలు కూడా కేందప్రభుత్వం అమలు చేస్తున్న స్వావలంబన పథకం ద్వారా పొదుపు చేయవచ్చని అధికారులు తెలిపారు. వృద్ధులకు స్వావలంబన పథకం ఆసరాగా ఉంటుందని  అన్నారు.  18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయస్సున్న ప్రజలు ప్రతినెలా రూ.వంద నుంచి వెయ్యి వరకు పథకం కింద నగదు పొదుపు చేయాలన్నారు. తద్వారా వృద్దాప్యంలో జమ చేసిన నగదు ఆధారంగా నెలవారీ పింఛన్లు పొందవచ్చని పేర్కొన్నారు. తద్వారా వృద్దాప్యంలో పిల్లలపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించవచ్చని వివరించారు. ఇండియన్‌ బ్యాంకు ఆధ్వర్యంలో 80 సంఘాలకు రూ.2.30 కోట్ల రుణాలు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *