Tuesday, 3 November 2026

పనిచేసే వారికి పార్టీలో ప్రాధాన్యం

చిత్తూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  ప్రభుత్వం అమలు చేస్తున పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేసే కార్యకర్తలకు కమిటీల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని జి/-లానాయకత్వం నిర్ణయించింది. . ఎన్నికల్లో ఇచ్చిన హావిూలకు కట్టుబడిన ఏకైనా పార్టీ తెదేపానేని ప్రజలకు గుర్తుచేయాలని చెప్పారు. ఈ వాస్తవాన్ని ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలతో పాటు నాయకులపై ఉందని అన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామ, వార్డు కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేస్తేనే పార్టీ బలోపేతమవుతోందని అన్నారు. జిల్లాలో  జరుగుతున్న వార్డు కమిటీల ఎంపిక పక్రియను పర్యవేక్షించారు. పార్టీలో పనిచేసేవారికి గుర్తింపును ఇస్తామని అన్నారు. సిఎం బాబుకూడా ఇదే ఆదేశం ఇచ్చారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *