తిరుమల,(జనంసాక్షి): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం తిరుమల శ్మశాన వాటికలో శ్రమదానం చేశారు. స్థానికులను తిరుమల నుంచి ఖాళీ చేయించే కార్యాక్రమాన్ని విరమించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుమల స్థానికులదే అనడానికి శ్మశాన వాటికే నిదర్శనమన్నారు. శ్మశాన వాటికను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ద వహించాలని భూమన అన్నారు.




