తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
తిరుమల,నవంబర్2(జనంసాక్షి): తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద బండరాళ్లు కూలి పడ్డాయి. అయితే ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దివ్యారామం సవిూపంలోని మలుపులో రహదారిపై పెద్దపెద్ద బండరాళ్లు పడిపోయాయి. దీంతో వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బండరాళ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. రాల్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేస్తున్నారు. వర్షాల కారణంగానే బండరాళ్లు దొర్లిపడ్డాయి.