రమణదీక్షితులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం
తప్పులను కప్పి పుచ్చుకునే యత్నంలో టిటిడి
తిరుమల,మే22(జనం సాక్షి): తిరులమ వ్యవహారాలు మొత్తంగా రమణదీక్షితులను దోషిగా చేసి చూపడం ద్వారా తప్పిదాల నుంచి పక్కకు జరగాలన్న ధోరణి టిటిడిలో కనినిస్తోంది. దీక్షితులు కోరినట్లుగా సిబిఐ విచారణ ఎందుకు వద్దు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు ? పోటు తవ్వకాలపై రమణ దీక్షితులు చెప్పగానే జెఇవో ను చీఫ్ ఇంజనీరును పంపి పరిశీలన చేయించాను అని ఇవో అశోక్ సింఘాల్ అప్పటికప్పుడు విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పారు, అంటే రమణ దీక్షితులు చెప్పనంత వరకూ ఇవోకు కూడా తవ్వకాల విషయం తెలియనట్లే కదా? అంత గోప్యంగా ఎందుకు ఎవరు తవ్వకాలు జరిపారు? పల్లవులు చోళ రాజులు సమర్పించిన వజ్రాలు నేలమాలిగల నుండి తవ్వేసుకున్నారా ?వేయి సంవత్సరాల పోటుతవ్వకాలకు సంబంధించి ఎలాంటి నియమనిబంధనలు పాటించారో వాటికి సంబంధించి అధికారిక అనుమతులు ఎమి తీసుకున్నారో ఇవోకు ఎందుకు వివరించ లేక పోతున్నారు?స్వామి వారికి 25 రోజులు భోజనం పెట్టని విషయం తెలియని ఇవోకు పురాతన ఆభరణాలు భధ్రంగా ఉన్న విషయం తెలుసు అని నమ్మగలమా ? స్వామి వారి నగల మాయం పై వచ్చిన తాజా ఆరోపణలపై కనీస ప్రాధమిక ధర్యాప్తు కూడా జరుపకుండా పాత రిపోర్టులను చూపెడుతూ ఇప్పుడు కూడా
అంతా బాగానే ఉందని ఇవో విూడియాకు చెప్పడం దాన్ని గుడ్డిగా నమ్మిన విూడియా తాటిపండు అక్షరాలతో అంతా క్షేమమే అని వ్రాయడం హస్యాస్పదం కాదా? అన్న విమర్శలు చెలరేగుఉతన్నాయి. ప్రధఆనంగా ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విహెచ్పి అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ కూడా ఇవే ప్రశ్నలను లేవనెత్తారు. ఆరోపణలు వచ్చాక స్వామి వారి నగలు ఇవో ప్రత్యక్షంగా చుసాడా ,తిరుమల జీయంగార్లకు కానీ నూతనంగా తాను నియమించిన ప్రధాన అర్చకులకు గాని కనీసం చూపెట్టకుండా అంతా బాగుంది అని చెబితే దాన్ని హిందూ సమాజం గుడ్డిగా నమ్మాలా? అని ప్రవ్నించారు. బంగారు డాలర్లు మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల చేతుల్లో స్వామి వారి నగలు ఎలా భధ్రంగా ఉంటాయో, వారిని ఇంకా అక్కడే కొనసాగిస్తున్న అధికారులు వివరణ ఇవ్వగలరా? అన్నారు. ఒక రిటైర్డ్ ఉద్యోగి చేతిలో వేలకోట్ల విలువైన ఆభరణాల తాళాలు ఉంచడం ప్రమాదం అని గతంలో ఇవోను హెచ్చరించినా ఇంకా ఆ ఉద్యోగుల చేతిలోనే ఎందుకు తాళాలు ఉన్నట్లు? అన్న అనుమానాఉల వ్యక్తం చేస్తున్నారు. 1996 నుండి ఆభరణాలకు ఎవరు జవాబు వహిస్తున్నారు అని ప్రధాన అర్చకులు లేవనెత్తిన మిలియన్ డాలర్ల పశ్నకు ఇవో సింఘాల్ ఎందుకు జవాబు దాట వేస్తున్నాడు? శ్రీ క్రిష్ణ దేవరాయలు , మైసూర్ రాజులు సమర్పించిన విలువైన నగలు మాయమైనాయా ? గులాబి వజ్రం దేశం దాటిందా? ఉన్న నగలలో కూడా అసలు మణి మాణిక్యాలు మాయం చేసి గిల్టు నగలు అలంకరిస్తున్నారా ? గత రెండు రోజులుగా రికార్డుల తారుమారు పక్రియ వేగంగా జరుగుతుందా?ఎందుకు వెంటనే రికార్డులు సీజ్ చేసి తాజాగా ఆభరణాల లెక్కింపు, దర్యాప్తు చేయించడానికి ప్రభుత్వం వెనుకడుగు వేయడంలో కారణాలు ఏమైఉంటాయి? చంద్రబాబు జెఇవో శ్రీనీవాస రాజులను రక్షించడానికై ఇవోను బలి చేయనున్నారా? తప్పు చేస్తే నన్ను శిక్షించండి ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను , విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి, విచారణ జరిపించండి అని ప్రకటించిన రమణదీక్షితులు డిమాండ్ పై చంద్రబాబు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడు ? పైగా ఆయనపై ఎదురుదాడికి పురమాయిస్తున్నారు. తెలుగు ప్రజల హక్కులకై ముందుండి పోరాడే తెలుగు విూడియా తెలుగు వారి ఇలవేల్పు వెంకన్న పవిత్రతకు అపచారం కలుగుతుంటే విచారణకు ఎందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని ప్రశ్నించడం లేదు? రమణదీక్షితులు చేసిన ఆరోపణలను పక్కదారి పట్టించడానికి వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయించడం వాటిని పతాక శీర్షికలతో ప్రచురించడంలో దాగున్న కుట్ర ఏమిటి? స్వామి వారి నగలు అన్యమతస్థుల చేతిలో భధ్రంగా ఉన్నాయి అని చెబితే సమాజం నమ్మాలా? ఇవి సగటు భక్తుని ప్రశ్నలు. ఇక్కడ సమస్య చంద్రబాబుదో రమణదీక్షితుదో కాదు. ఇది తిరుమల తిరుపతి పవిత్రత అక్కడి వ్యవస్థల సంరక్షణ అంశంగా పరిగణించాలి. తిరుపతి విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించి జరుగుతున్న చర్చకు ముగింపు పలికి తిరుమల పవిత్రత కాపాడాలి.ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో చోటు చేసుకుంటున్న అపచారాల గురుంచి, ఈ పాపాలకు పూనుకున్న వారిని ఆ స్వామి శిక్షించడం ఖాయం.
తిరుమల వ్యవహారంలో గందరగోళం




