తుంగభద్రకు చేరుతున్న వరదనీరు

కర్నూలు,జూలై2(జ‌నం సాక్షి ): కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర, కృష్ణా నదులకు వరద ప్రారంభమైంది. రెండు రోజుల నుంచి తుంగభద్ర, కృష్ణా నదుల ప్రవాహం మొదలైంది. దీంతో తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ ఫ్లో 31,780 క్యూసెక్కులు, ఔట్‌ ఎ/-లో 60 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర ప్రస్తుత నీటిమట్టం 1611.47 అడుగులుగా నమోదు అయ్యింది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 38.139 టీఎంసీలుగా ఉంది. వరద ఇలాగే కొనసాగితేనే కృష్ణాలో నీరు చేరే