Wednesday, 4 November 2026

తూ.గో: గొల్లపాలెం వద్ద ఓఎన్జీసీ పైప్‌లైన్ లీకేజీ

తూర్పుగోదావరి, ఆగస్టు 16: మలికిపురం మండలం గొల్లపాలెం దగ్గర ఓఎన్జీసీ క్రూడాయిల్‌ పైప్‌లైన్‌ లీకేజీ అయింది. తక్షణమే స్పందించిన అధికారులు లీకేజీని అదుపుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు లీకేజీ వార్త గుప్పుమనడంతో  స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే లీకేజీని సరిచేసి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *