తెలంగాణకు రాహుల్
హైదరాబా’,మే5(జనంసాక్షి): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 10న ఆదిలాబా’ జిల్లా నిర్మల్‌కు రాహుల్ చేరుకోనున్నారు. ఓ గిరిజన తండాలో బస చేయనున్నారు. ఈ నెల 11న రైతు ఆత్మ గౌరవ యాత్ర పేరుతో రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో చేపట్టదలచిన రైతు ఆత్మగౌరవ యాత్రకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 10వ తేదీ సాయంత్రం హైదరాబా’ చేరుకుని అక్కడి నుంచి ఆదిలాబా’ జిల్లా నిర్మల్ నియోజకవర్గంకు వెళ్తారు. అయితే ఆ రాత్రి రాహుల్ గాంధీ బస చేయడానికి ఏజెన్సీ ప్రాంతంలోని సాయినగం తండా, మహావీంతండా, పోటుపల్లి, జహ్నం నాలుగు గ్రామాలను ఇప్పటికే టీపీసీసీ పరిశీలించింది. ఈ నాలుగు గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో ఆయన బస చేయనున్నట్లు సమాచారం. కాగా 11వ తేదీన ఆదిలాబా’ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలో జరిగే ఆత్మగౌరవ యాత్రలో రాహుల్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన 15 కిలోవిూటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈ
సందర్భంగా రాహుల్ జిల్లాలోని లక్ష్మణ్‌చంద మండలంలోని వద్యాలు, రాచాపూం, పోటుపల్లి, లక్ష్మణ్‌చంద, కోరటికల్లు గ్రామాల్లో పర్యటించి ఐదు రైతు కుటుంబాలను రాహుల్ పరామర్శిస్తారు.