
విజయవాడ, జూలై 6 (జనంసాక్షి) :
తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ఎలాంటి నిర్ణయం కాదనబోనని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై విపులంగా అభిప్రాయం చెప్పే పరిస్థితిలో తాను లేనని, అయితే గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లో యూ టర్న్ తీసుకునే వ్యక్తిని కాదన్నారు. వ్యక్తిగత అభిప్రాయానికి తగి నప్రాధాన్యం ఇచ్చేందుకు శాయశక్తులా పనిచేస్తానన్నారు. తెలంగాణపై సుదీర్గంగా సమాధానం చెప్పలేనని అంటూ దీనికి కేంద్ర మంత్రి పదవి అడ్డు వస్తుందన్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానన్నారు. వ్యక్తిగా తాను గొప్పేంకాదని, తానీ స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ జండాయే కారణం అన్నారు. తెలంగాణ అంశం సున్నితమైనదని, దీనిని కాంగ్రెస్ అధిష్టానం సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. రాష్టాన్న్రి ప్రశాంతంగా ఉంచేందుకు తొలుత ప్రయత్నించాలన్నారు. తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంపై పరిస్థితులు ఎలా ఉంటాయనేది చెప్పలేనన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానన్నారు.
తెలంగాణపై అధిష్టాన నిర్ణయాన్ని కాదనను : జేడీ శీలం




