సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక అరుదైన పక్షి అక్కడి స్తానికులకు కనువిందు చేసింది. ఓ విద్యుత్ స్తంభంపై వాలిన ఆ పక్షి బూడిద రంగులో ఉంది. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండటం, దానిపై మరో చిన్న ముక్కు ఉండటంతో స్థానికులు ఆపక్షిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.కొంగజాతికి చెందిన ఈ పక్షి పేరు గ్రే హార్న్ బిల్ అని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇది కూడా అంతరించిపోతున్న పక్షిజాతి జాబితాలో ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో అరుదైన పక్షి




