550 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసింది. గిరిజన గురుకులాల్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్న 550 మందిని ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ శనివారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.




