Wednesday, 4 November 2026

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

17brk_ssc1

హైదరాబాద్‌: తెలంగాణలో తొలి పదో తరగతి పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. 77.5శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలురు 76.11 శాతం, బాలికలు 79.04 శాతం ఉత్తీర్ణ సాధించారు. 91.6శాతం ఉత్తీర్ణతలో వరంగల్‌ జిల్లాకు మొదటి స్థానం సాధించగా, 54.9 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్‌ జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 28 పాఠశాలల్లో ‘సున్నా’ శాతం ఉత్తీర్ణత నమోదైంది.

జూన్‌ 18 నుంచి పదోతగరతి సప్లిమెంటరీ పరీక్షలు

జూన్‌ 18 నుంచి జులై 2 వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. పరీక్ష రుసుం చెల్లింపునకు మే 30 చివరి తేదీగా నిర్ణయించినట్లు చెప్పారు.

ప్రైవేటు పాఠశాలలు ర్యాంకుల ప్రకటనలు ఇస్తే చర్యలు: కడియం

ప్రైవేటు పాఠశాలలు టీవీలు, పత్రికల్లో పదోతరగతి ఫలితాల ర్యాంకుల ప్రకటనలు ఇవ్వొద్దని సూచించారు. ప్రైవేటు పాఠశాలలు ర్యాంకులు ప్రకటనలు ఇస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. పదోతరగతి ఫలితాల్లో ప్రైవేటు విద్యార్థులు 54.13శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రైవేటు విద్యార్థుల్లో బాలురు 51.17, బాలికలు 60.32 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *