Tuesday, 3 November 2026

తెలంగాణలో మైనార్టీ గురుకుల పాఠశాలలు

C

– 30బాలికలకు, 30 బాలురకు

– ఊర్దూ భాషను కాపాడాలి

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ నవంబర్‌ 07 (జనంసాక్షి):

వచ్చే విద్యా సంవత్సరం నుంచి మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ సచివాలయంలో మైనార్టీ సంక్షేమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తొలిదశలో బాలురకు 30, బాలికలకు 30 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. చంచల్‌గూడ, రేసు కోర్సుల స్థానాల్లో పాఠశాలలు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. మైనార్టీ యువకుల కోసం కొత్త పథకాలు రూపొందించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు.

రాష్ట్రంలో తెలుగుతోపాటు ఉర్దూను కూడా కాపాడుకోవాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్‌ అన్నారు. భావితరాలకు మంచి భవిష్యత్‌ అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. మొదటి ఏడాది అద్దె భవనాల్లో రెసిడెన్షియల్‌ పాఠశాలలు నడపాలి. రెండో ఏడాది నాటికి సొంత భవనాలు సిద్ధం చేయాలి. హైదరాబాద్‌లో మైనార్టీ పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వారికోసం రెసిడెన్షియల్‌ పాఠశాలల కట్టడానికి ఎక్కువ స్థలం అవసరం. చంచల్‌గూడ జైలు, రేస్‌ కోర్సును అక్కడి నుంచి తరలించి ఆ స్థలాల్లో మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్సియల్‌ విద్యాలయాలను ప్రారంభించాలి. మైనార్టీ యువకుల ఉపాధి కోసం పిల్లలకు వందశాతం విద్యనందించడమే లక్ష్యంగా కొత్త పథకాల రూపొందించాలి.

రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియంలో బోధన. ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల తరహాలోనే మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు. రాష్ట్రంలో తెలుగుతోపాటు ఉర్దూను కూడా కాపాడుకోవాల్సిన అవసరముంది. అందుకోసం మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో ఉర్దూను ఆప్షనల్‌ లాంగ్వేజ్‌గా ప్రవేశపెట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనార్టీ హ్యాకర్లు, వెండర్లకు ఆర్థిక సహకారం అందించేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *