Tuesday, 3 November 2026

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

heat wave 67 _7హైదరాబాద్ : తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా.. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్, మహబూబ్ నగర్, రామగుండం, నల్లగొండల్లో 42 డిగ్రీలు, హైదరాబాద్,ఖమ్మంలలో 41 డిగ్రీలు ఉష్గోగ్రతలు నమోదయ్యాయి… మిగిలిన ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండే ఎండలకు తోడు.. వడగాలులూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

వడగాలులకు రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది మృతి ….

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు ఇదేవిధంగా కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వడగాలుల కారణంగా ఇప్పటికే 110 మంది మరణించినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో.. వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ఉష్ణోగ్రతలకుతోడుతీవ్రంగావీస్తున్నవడగాలులు

తెలంగాణ అంతటా ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పగలు పది గంటలకే.. ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే.. మేనెల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు కలవరపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *