Tuesday, 3 November 2026

అనుమానంతో భార్యను చంపిన భర్త

శాంతిపురం(చిత్తూరు) : అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో పెళ్లకోగిళ్ల గ్రామానికి చెందిన శివానంద, అలివేలమ్మ(30) దంపతులకు పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులున్నారు.

అయితే, భార్యపై శివానంద అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను బుధవారం సాయంత్రం గొంతుపిసికి చంపేశాడు. గురువారం ఉదయం శాంతిపురం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వారి నివాసం గ్రామానికి దూరంగా ఉండటంతో అతడు వచ్చి చెప్పేదాకా ఈ దారుణం ఎవరికీ తెలియలేదు. ఈ మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *