
రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు భేష్
ప్రధానికి వివరించిన గవర్నర్
ఢిల్లీ,డిసెంబర్12(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య అధికంగా ఉందనీ విభజన చట్టం ప్రకారం అందాల్సిన విద్యుత్‌పై వాస్తవ పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం గవర్నర్ ప్రధానిని ఆయన కార్యాలయంలో కలిసారు. రెండు రాష్టాల్ల్రో పరిస్థితులను వివరించారు. విభజన సమస్యలు పెద్దగా లేవని , అధికారుల కేటాయింపు రెండు రాష్టాల్ల్రో ప్రభుత్వాలకు ఇబ్బందులు తెస్తుందని గవర్నర్ ప్రధానికి తెలిపినట్లు తెలిసింది. రెండు రాష్టాల్ల్రో శాంతి భద్రతల సమస్య లేదని తెలిపారు. పాలన సక్రమంగానే సాగుతోందన్నారు. తెలంగాణలో ప్రధాన సమస్య అయిన విద్యుత్ సమస్యపై గవర్నర్ ,ప్రధానికి వివరించారు. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ విూడియాతో మాట్లాడారు. రెండు రాషాల్లో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని, ఇద్దరు సీఎంలు బాగానే పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఇంటర్ పరీక్షలపై స్పందిస్తూ…. విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ పరీక్షలు రెండు రాష్టాల్ల్రో వేర్వేరుగా జరుగుతాయని తెలిపారు. ఎంసెట్ పరీక్ష మాత్రం ఉమ్మడిగానే జరుగుతుందని గవర్నర్ వెల్లడించారు. రెండు రాష్టాల్ల్రో ప్రజలు సుఖంగానే ఉన్నారని, ఎటువంటి సమస్యలు లేవన్నారు.




