Tuesday, 3 November 2026

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల్లోను బాలికలదే పైచేయి

7mvk54ojహైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. హైదరాబాద్ లోని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 3లక్షల 78 వేల 973 మంది విద్యార్థులు హాజరవ్వగా… అందులో 2లక్షల 32 వేల 742 మంది ఉత్తీర్ణత సాధించారు. 61.41 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 66.86 శాతం, బాలురు 55.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటిస్థానంలో రంగారెడ్డి జిల్లా రాగా.. చివరి స్థానంలో నల్గొండ జిల్లా వచ్చింది. గతేడాది కన్నా.. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. బోర్డు పనితీరును మరింత మెరుగు పరుస్తామని వివరించారు. మే 1 నుంచి ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ నుంచి మెమోరండాలను విద్యార్థులు పొందవచ్చని తెలిపారు. ఫలితాల్లో ఏమైనా.. అనుమానాలు, సవరణలు ఉంటే.. మే 27 వ తేదీ లోపుగా అప్పీల్ చేసుకోవాలన్నారు. మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 6 జూన్ 2015 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ అని తెలిపారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు, పాస్ అయిన వారికి కూడా మే 4 నుంచి 22 వరకు ప్రతి జిల్లా కేంద్రంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి… మూడు వారాల పాటు క్లాసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మూడు వారాలపాటు బోర్డింగ్, లాడ్జింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డివిఈవోల చే భోదన ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *