తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రాజ్‌భవన్‌కు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ తాను 70 ఏండ్లుగా పుట్టిన రోజు జరుపుకుంటున్నప్పటికీ ఇంత ఆనందంగా ఎన్నడూ లేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపడం మరింత ఆనందంగా ఉందన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి మొదటి గవర్నర్ కావడం, పురోగమిస్తున్న రాష్ట్రంలో నా భాగస్వామ్యం ఉండటం సంతోషాన్ని కలిగుస్తున్నదని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఆ రాష్ట్రానికి మొదటి గవర్నర్‌గా పని చేశానన్న తృప్తి ఉంటుందన్నారు.
తెలంగాణ గవర్నర్ అయినందుకు తృప్తిగా ఉంది




