Monday, 2 November 2026

పోలవరం ప్రాజెక్టు చేయలేమన్నకేంద్ర ప్రభుత్వం

టిడిపి జన చైతన్య యాత్రలో పా్ల్గొన్న సందర్భంగా మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తాము చేయలేమని, కేంద్రమే ఎపి ప్రభుత్వాన్ని చేయాలని కోరిందని అన్నారు. 9984_municipal-administration-miపోలవరం ప్రాజెక్టు ను 2018 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారని ,కేంద్రం తన వల్ల కాదని చెప్పినందునే ఆ బాద్యతను ముఖ్యమంత్రి స్వీకరించారని ఆయన అన్నారు.దీనిని కూడా కొన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి వారం దీనిపై సమీక్షిస్తున్నారని, ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళుతున్నారని నారాయణ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *