Tuesday, 3 November 2026

తెలంగాణ పాలన భేష్‌

5

రాష్ట్రానికి కొత్త పోస్టల్‌ సర్కిల్‌

ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌కు నిధుల పెంపు

కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌

సీఎం కేసీఆర్‌తో భేటీ

 

హైదరాబాద్‌ డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర పాలన అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలోనే సర్కార్‌ సరైన దిశగా పయనిస్తుందనీ కేంద్ర సమాచార శాఖా మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ కితాబునిచ్చారు. కొత్త రాష్ట్ర పురోభివృద్దికి కేంద్రం సహకరిస్తుందనీ ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్టాన్రికి కొత్త పోస్టల్‌ సర్కిల్‌ను మంజూరు చేసినట్లు రవిశంకర్‌ప్రసాద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కలిసిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్‌ లో ఐటీ అభివృద్దిపై కూడా మంత్రి సీఎంతో చర్చించారు. కొత్తగా రాష్ట్రంలో నెలకొల్పే ఐటీ పరిశ్రమల వివరాలను రాష్ట్ర ఐటి మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రికి వివరించారు. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే ఐటీ రంగం అభివృద్ది చెందిందని,అనేక కంపెనీలు తమ శాఖ లను నగరంలో నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయని రవిశంకర ప్రసాద్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ ప్రదేశంగా హైదరాబాద్‌ నగరాన్ని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సంస్థ గుర్తించిందని రవిశంకర్‌ వెల్లడించారు. ఐటీఐఆర్‌ ప్రాంతంలో ఆసుపత్రి, విద్యా సంస్థలను నెలకొల్పేందుకు సహకరిస్తామని ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు. ఐటీఐఆర్‌కు కేంద్రం మొదటి దశలో రూ.156 కోట్లు కేటాయించిందని, ఆర్థిక సాయం సరిపోదని కేసీఆర్‌, మంత్రితో అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి, ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని సూచించారు. ఐటిఐఆర్‌ ప్రాజెక్టును 202 స్క్వేర్‌ కిలో విూటర్లలో,49.913 కి.విూ. పరిధిలో నెలకొల్పుతున్నారు. దీనిద్వారా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఐటీ రంగంలోనే లక్షా ఇరవై వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర మంత్రికి వివరించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నూతన ఐటీ విధానంలో ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్దికి కేంద్రం అన్నివిధాలా సహకారం అందిస్తుందని రవశంకర ప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ముఖ్యమంత్రి కార్యదర్శి నర్సింగరావు, ఎంపీ నర్సయ్యగౌడ్‌,తదితర అధికారులు కేంద్ర మంత్రితో భేటీ అయిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *