జమ్మూకాశ్మీర్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ
హైదరాబాద్ డిసెంబర్ 13 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో వారసత్వ పార్టీలను ప్రజలు ఓడించాలనీ, కష్టాలకు కాంగ్రెస్సే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లోని కథౖవాలో జరిగిన భాజపా సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ జమ్మూకశ్మీర్‌లో ప్రతిసారి ఏర్పడే ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరుతుందని ఎన్నికలకు ముందు తప్పుకొని అధికార పక్షంపై దాడులకు దిగుతుందని విమర్శించారు. రాష్గాన్ని కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలు పాలించాయని కష్టాలకు వారి పాలనే కారణమన్నారు. భాజపా ఎప్పుడు పాలించలేదని అలాంటప్పుడు తమపై ఇతర రాజకీయపక్షాలు ఎలా విమర్శలు చేస్తాయని ఆయన ప్రశ్నించారు. భాజపాకు రాష్ట్ర ప్రజలు అధికారమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు.
జీవితాన్ని ముగించుకోవాలంటూ తీవ్రచర్యలకు పాల్పడే వ్యక్తులను శిక్షించరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐపీసీ నుంచి ఆత్మహత్యా నేరం తొలగింపుపై ఆయన శనివారమిక్కడ పైవిధంగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారికి కావాల్సింది శిక్ష కాదని, సరైన కౌన్సెలింగ్ అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆత్మహత్యాయత్నం నేరం కాదని …ఆత్మహత్యను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 309ను తొలగించాలని నిర్ణయించిన విషయం విదితమే.





