హైదరాబాద్: తెలంగాణ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిడిపి ఎమ్మెల్సీలు టీఆర్ ఎస్ లో విలీనంపై టిడిపి ఎమ్మెల్సీ నర్సారెడ్డి హైకోర్టును ఆశ్రయించించారు. స్వామిగౌడ్.. టిడిపి ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రకటించాల్సి ఉండగా….దానికి బదులుగా పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించడంపై నర్సారెడ్డి కోర్టుకు వెళ్లారు. దీంతో వివరణ ఇవ్వాలని స్వామిగౌడ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు హైకోర్టు నోటీసులు




