నల్గొండ : తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా మారడం ఖాయమని, తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా మార్చాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నిర్వహిస్తున్న తరగతుల్లో రెండో రోజు వ్యవసాయం అంశంపై క్లాసు జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే చర్యలు తీసుకోవాలని, వ్యవసాయదారులకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఖ్య పెంచుతామని, వ్యవసాయంలో సాంకేతికత, ఆధునీకత పెరగాలని సూచించారు. త్వరలోనే నిజమైన ఆదర్శ రైతులుగా గుర్తిస్తామని, ఆదర్శ రైతులతో చర్చించి వ్యవసాయ విధానం ప్రకటిస్తామని ఈసందర్భంగా కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ విత్తన భాండాగారంగా మారడం ఖాయం – కేసీఆర్..





