తెలంగాణ తెచ్చిందెవరు.. ఇచ్చిందెవరు..?
సభలో వాగ్వివాదం
హైదరాబాద్, నవంబర్ 29 (జనంసాక్షి) : తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిందెవరు.. ఇచ్చిందెవరు..? అనే అంశంపై సభలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కారణంగానే తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉప ముఖ్యమంత్రి రాజయ్య చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారంరేపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తరువాత రెండేళ్ళు జాప్యం చేసిందని, దీంతో ఆందోళను గురైన విద్యార్ధులు,యువకులు బలిదానాలు చేసారని ఆయన అన్నారు కేసీఆర్ దీక్ష చేసినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదన్నారు. రాజయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీని పణంగా పెట్టి తెలంగాణ రాష్టాన్న్రి సోనియా గాంధీ ప్రటించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజయ్య సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నా లెక్క చేయకుండా తెలంగాణ ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని అభివర్ణించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఇదేనా విూరిచ్చే గౌరవం అంటూ తెరాస సభ్యులను ప్రశ్నించారు. అనంతరం భాజపా సభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో వందల మంది బలిదానాలకు కాంగ్రెస్‌పార్టీనే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని దంచి తెలంగాణ తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి సభలో దుమారం రేగింది. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రె సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ రెండోసారి వాయిదా పడింది. తిరిగి వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంలో ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అడగకుండానే టిక్కెట్ ఇచ్చారని… సోనియా అంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పులుంటే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం వాటర్ గ్రిడ్ పై చర్చను ప్రారంభిస్తున్నట్లు స్పీకర్ మధుసూధనా చారి ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తుండటంతో మంత్రి హరీష్ రావు కల్పించుకొని, అత్యంత ప్రాధాన్యత కలిగిన వాటర్‌గ్రిడ్‌పై చర్చకు సభ్యులు సహకరించాలని కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనలు




