హైదరాబాద్, డిసెంబర్5 (జనంసాక్షి) : తెలంగాణ సాంస్కృతిక సారథిగా మానకొండూర్ ఎమ్మెల్యే, ప్రముఖ కళాకారుడు ఏర్పుల (రసమయి) బాలకిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ముఖ్యపాత్ర వహించాలని కోరారు. జూబ్లీహిల్స్‌లోని సాంస్కృతిక శాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారధి కార్యక్రమాల నిర్వాహణకు వినియోగించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. చెరువుల పునరుద్ధరణ, హరితహారం, వాటర్‌గ్రిడ్ తదితర కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. సాంఘీక దురాచారాలు, మూఢనమ్మకాలపై కూడా ప్రచార యుద్ధం సాగించాలన్నారు. కళాప్రదర్శనలకు అనువైన శిక్షణనివ్వడానికి, వర్క్‌షాపులు నిర్వహించడానికి సాంస్కృతిక సారథిగా సమన్వయ బాధ్యతలు నిర్వహించాలన్నారు.
తెలంగాణ సాంస్కృతిక సారధిగా రసమయి





