ముంబాయి, డిసెంబర్5 (జనంసాక్షి) : మహారాష్ట్ర మంత్రివర్గాన్ని శుక్రవారం విస్తరించారు. ఈ సందర్భంగా మరో పది మంది కొత్తగా కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఐదుగురు భాజపా నుంచి కాగా, మరో ఐదుగురు శివసేన నుంచి ఉన్నారు. మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్న శివసేన ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామి కాబోతున్న సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండేకి కేబినెట్ మంత్రి పదవి లభిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా సమర్పించారు.
మహారాష్ట్ర మంత్రివర్గంలో శివసేన





