Tuesday, 3 November 2026

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

hb19j3vv
హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజులుగా చలితీవ్రత పెరిగింది. హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం మారిపోయింది. ఈ శీతాకాలంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతతో నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చీకటి పడగానే ఒక్కసారిగా పెరిగిన చలితో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. వివిధ పనుల మీద హైదరాబాద్‌ వచ్చిన వారు రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు, ఆసుపత్రుల వద్ద తీవ్ర అవస్థలకు గురయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు చలిలో వణుకుతూనే నగరంలో రోడ్లు శుభ్రం చేశారు.
ఉత్తర భారతం నుంచి తెలంగాణవైపు శీతల గాలుల
 ఆదిలాబాద్‌లో ఈ నెలలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత శుక్రవారం తెల్లవారుజామున 7.7 డిగ్రీలుగా నమోదైంది. ఇది మరింత తగ్గే అవకాశాలున్నాయి. ఉత్తర భారతం నుంచి తెలంగాణవైపు శీతల గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. రాబోయే పదిరోజుల పాటు ఇలాగే
ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలున్నాయని వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌, రామగుండంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు తగ్గింది. హైదరాబాద్‌లో తేమ సాధారణంకన్నా 22 శాతం తక్కువగా ఉంది. తేమ తగ్గడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటిపూట మాత్రం సాధారణంకన్నా ఎండ వేడి కాస్త ఎక్కువగానే ఉంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో…
విశాఖ మన్యంలో చలిగాలుల తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం ఉదయం  మినుములూరులో 6, లంబసింగిలో 7, పాడేరులో 8, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు ఏజెన్సీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *