హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద భారీకాయుడిగా గుర్తింపు పొందిన ఆండ్రెస్ మోరినో(38) శుక్రవారం మెక్సికోలో మృతిచెందారు. గుండెనొప్పి కారణంగా ఆయన మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దాదాపు 450కిలోల బరువు ఉండే ఆండ్రెస్ మోరినో గత రెండు నెలల క్రితం బరువు తగ్గేందుకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారని స్థానిక న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
శస్త్రచికిత్స అనంతరం ఆయన సాధారణంగానే జీవిస్తున్నారని.. అయితే క్రిస్మస్ రోజున అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందినట్లు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత ఆండ్రెస్ మోరినో దాదాపు 100కిలోల బరువు తగ్గినట్లు సమాచారం.




