అలహాబాద్: కుంభమేళాకు వచ్చిన భక్తుల రద్దీతో అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి పలువురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది భక్తులు త్రివేణిసంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి 7 గంటలకు అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో యాత్రికుల రద్దీ ఒక్కసారిగా పెరగడటంతో 6వ ప్లాట్‌ఫాంపై తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై యూపీ సర్కారు విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.




