కడప : రామాపురం అటవీ ప్రాంతంలో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు వేలూరుకు చెందిన వీరు ఎర్రచందనం చెట్లను నరుకుతుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వేలూరు నుంచి వచ్చిన మిగతా స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.




