– ముస్లిమైనందుకే అక్లక్‌ను చంపారు
– దళిత పిల్లలను సజీవదహనంచేసి కుక్కపిల్లలతో పోలుస్తారా?!
– ప్రధాని మౌనమే అసహనానికి కారణం
– లోక్‌సభలో రాహుల్ ఫైర్
– అన్నింటికీ పరిష్కారం రాజ్యాంగమే
– ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,డిసెంబర్1(జనంసాక్షి):
దేశంలో హేతువాదులు దారుణ హత్యలకు గురవుతున్నా.. ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మంగళవారం లోక్‌సభలో అసహనంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు.మోదీ లోక్‌సభలో రాజ్యాంగం గురించి ప్రసంగించినప్పుడు అంబేద్కర్, నెహ్రూ, రాజేందప్రసాద్ లాంటి గొప్ప వ్యక్తుల గురించి ప్రస్తావించారని గుర్తుచేశారు. మరి సామాన్యులకు ఎదురయ్యే సమస్యలపై ఎందుకు స్పందిచడంలేదని ప్రశ్నించారు. మత విద్వేషాలను భాజపా ప్రభుత్వం రెచ్చగొడుతుందని ఆరోపించారు. మోదీకి రాజ్యాంగంపై గౌరవం ఉంటే.. దాద్రి ఘటనపై ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదన్నారు.ముస్లిమైనందుకే అక్లక్‌ను చంపారన్నారు. మోదీని విమర్శించినందుకు అరుణ్ శౌరీ విూద భాజపా విమర్శలు చేయడం దారుణమన్నారు. హర్యాణాలో దళిత బాలుడిపై జరిగిన దాడిని ఓ కేంద్ర మంత్రి కుక్కలతో పోల్చినా మోదీ స్పందించలేదన్నారు. ప్రముఖ వ్యక్తులైన ఆర్.నారాయణమూర్తి,పి.ఎమ్.భార్గవ వంటి వారు చెప్పేదానికి విలువ లేదా అని వ్యాఖ్యానించారు. వాళ్లకు వేరే పనిలేక అసహనంపై నిరసన వ్యక్తం చేశారా అని ఆయన అన్నారు.రు.మేధావులుగా ఉన్న వారు ఏమి చెబుతారో వినండి ,అసహనంగా ఉండకండి అని రాహుల్ అన్నారు. గాంధీజీ గురించి గొప్పగా చెప్పిన నరేంద్ర మోడీ బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ మాట్లాడుతూ నాధూరామ్ గాడ్సే ని దేశభక్తుడు అని అంటే ఖండించలేదని రాహుల్ అన్నారు. ప్రజల స్వరాన్ని రాహుల్ వినాలని కోరుకుంటున్నానని అన్నారు. రాహుల్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు కొట్టారు.
రాజ్యాంగం దేశానికి వెలుగురేఖ, దిక్సూచి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు పునరుద్ఘాటించారు. రాజ్యాంగంపై రాజ్యసభలో నిర్వహించిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. కాలగమనంలో అనేక సమస్యలకు రాజ్యాంగం మనకు పరిష్కారం చూపించిందని మోదీ అన్నారు. భారతీయ జీవన విధానంలో మంచి విషయాలను పది మందికి నిరంతరం చెబుతూ ఉంటామన్నారు. రాజ్యాంగం అండగా నిలబడుతుందన్న భావన ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సభలో జరిగే ప్రతి చర్చా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. పార్లమెంట్‌లో జరిగే ప్రతి చర్చా జనసామాన్యంలోకి వెళ్లాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం దాటి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. కాలగమనంలో అనేక సమస్యలకు రాజ్యాంగం పరిష్కారం చూపించింది. భారతీయ జీవనంలో మంచి విషయాలను పది మందికి నిరంతరం చెబుతూ ఉంటామని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎంతకాలం ఉంటుంది… ఎంతకాలం సాగుతుంది అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని… బ్రిటిష్ వాళ్లు అప్పుడప్పుడు ఇలాంటి భావనలకు మరింత బలం చేకూరేలా ప్రవర్తించారన్నారు. అనేక అవాంతరాల మధ్య భారత్ ప్రజాస్వామ్య దేశంగా సగర్వంగా తలెత్తుకుని నిలబడిందన్నారు. రాజ్యాంగం అండగా నిలబడుతుందన్న భావన ప్రతి ఒక్కరికి తెలియాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎంతకాలం ఉంటుంది. ఎలా సాగుతుందన్న అనుమానాలు ఉండేవి. బ్రిటీష్ వాళ్లు అప్పుడప్పుడు ఇలాంటి భావనలకు మరింత బలం చేకూరేలా ప్రవర్తించారు. ఈ సభలో పెద్దపెద్దవాళ్లు, గొప్పవాళ్లు చాలా మంది ఉన్నారు. అయినా కొన్ని సందర్భాల్లో ఆత్మావలోకనం అవసరం. రెండు సభల మధ్య కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఒకరికొకరు పరస్పరపూర్వకంగా వ్యవహరించాలని నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు.





