Monday, 2 November 2026

దావూద్‌ పాకిస్తాన్‌లోనే ఉన్నాడు

కదలికలపై కన్నేశాం

విదేశీ దౌత్యాన్ని కోరతాం
3
హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

లక్నో: మాఫియా ముఠానేత దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన సమాచారం యావత్తూ భారత ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం నాడిక్కడ వెల్లడించారు. దావూద్‌ వ్యవహారంలో విదేశీ దౌత్యం, రాజకీయ చొరవను భారత్‌ కోరుతుందని స్పష్టం చేశారు. దావూద్‌ ఇబ్రహీం కదలికలు, కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచినట్లు చెప్పారు. దావూద్‌ ఇబ్రహీం…భారత్‌ అత్యంత తీవ్రంగా అన్వేషిస్తున్న తీవ్రవాది అనీ అతడిని అప్పగించాల్సిందిగా పదేపదే పాకిస్థాన్‌ను భారత్‌ను కోరుతూనే ఉందనీ రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఇంతకీ అతడిని ఎప్పుడు పట్టుకుంటారు అన్న ప్రశ్నకు…’వేచి చూడండి’ అంటూ ఆయన స్పందించారు. దావూద్‌ ఇబ్రహీం తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిరాటంకంగా నడుపుతున్నాడనీ…కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుంటూ…దానిని ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాల కోసం విచ్చలవిడిగా వెచ్చిస్తున్నారంటూవార్తలొచ్చాయి. అంతేకాదు, పాకిస్థాన్‌ నుంచి దావూద్‌ ఇబ్రహీం తన తీవ్రవాద సూపర్‌మార్కెట్‌ను దర్జాగా నడిపేస్తున్నారనీ…కరాచీలో స్థిరాస్థి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడంటూ ‘న్యూస్‌ మొబైల్‌’ వెబ్‌ పోర్టల్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ సౌరభ్‌ శుక్లా పేర్కొన్నారు. పాశ్చ్యాత్త దౌత్య వర్గాల నుంచి అందిన టేపుల ఆధారంగా ఈ వార్తలను ప్రచురించారు.

ఈ నేపథ్యంలో ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ…దావూద్‌ విషయంలో ఏం చేయాలనే విషయాన్ని కేంద్రప్రభుత్వం త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక్కడి అమీనాబాద్‌ మహిళా కళాశాల 75వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

మహిళల భద్రత….సాధికారత సాధనకు కేంద్రం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర పోలీసుదళాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంటుందనీ…ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ సూచనలు పంపామనీ చెప్పారు. కేంద్ర పారామిలిటరీ దళాల్లో ప్రస్తుతం 1.5 శాతంగా ఉన్న మహిళల సంఖ్య మరో మూడేళ్ల వ్యవధిలో 5 శాతానికి పెరుగుతుందని ¬ంమంత్రి వివరించారు.

మరోవైపు 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల ఘటనలో నిందితుడైన దావూద్‌ ఆచూకీ కోసం భారత్‌ సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తోందని, దావూద్‌ ఎంతో కాలంగా పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్నాడని, అతడిని వెంటనే అప్పగించాలని కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు కోరారు. ఎంతో కాలంగా దావూద్‌ను అప్పగించాలని కోరుతున్నామన్నారు. దావూద్‌ కరాచీలో ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, తమకు లభించిన ఆధారాలను పాక్‌ ప్రభుత్వానికి పంపామని, ఇకనైనా దావూద్‌ను అప్పగించే విషయంలో పాక్‌ భారత్‌కు సహాయపడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *