Monday, 2 November 2026

. రాహుల్‌ పూర్తి స్థాయి పగ్గాలు చేపట్టాలి

5

దిగ్విజయ్‌ సింగ్‌

భోపాల్‌()-ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ పూర్తి బాధ్యతలు  పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలంతా కోరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌ శనివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ పూర్తి బాధ్యతలు తీసుకొని పార్టీని నడిపిస్తే.. పార్టీ మద్దతుదారులంతా ఆయన వెంట ఉంటారని పేర్కొన్నారు. సోనియాగాంధీ ఎప్పటికీ తమ నాయకురాలు అని, ఆమె నాయకత్వంలోనే పార్టీ కొనసాగుతుందన్నారు. సోనియా నాయకత్వంలో పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని గుర్తుచేశారు. ఇప్పుడు రాహుల్‌గాంధీకి అవకాశమివ్వాలన్నారు.

మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో కేంద్రం విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *