దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ సీ-36

 isro-pslv-3శ్రీహరికోటలోని సతీష్‌ దవాన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి ఉదయం 10.25గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-36ను ప్రయోగం చేయనున్నారు. 1,235కిలోల బరువు ఉన్న రీసోర్స్‌ శాట్‌-2ఏను పీఎస్‌ఎల్వీ సీ-36 నింగిలోకి తీసుకెళ్లనుంది. రీసోర్స్‌ శాట్‌-2ఏ వ్యవసాయరంగానికి సంబంధించిన సేవలను అందించనుంది.