Tuesday, 3 November 2026

14న కలెక్టర్ల సదస్సులో టీఎస్ వాలెట్‌

డిజిటల్‌ అక్షరాస్యతతోపాటు రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెంచే అంశంపై చర్చించడానికి ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ‘‘పాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, మటన కొనే దుకాణాల్లో చెక్కులిచ్చి కొనుక్కునే అలవాటు మనకు లేదు. బ్యాం కు లావాదేవీలు ఇలాంటి వ్యవహారాల్లో లేవు. అన్నీ kcr-0-620x330ఒక్కసారే అలవా టు కావు. వాళ్ల మైండ్‌సెట్‌ మారాలి. అందుకు వాళ్లను ఎడ్యుకేట్‌ చేయాలి. ఇందుకు మీ బ్యాంకులు సహకరించాలి’’ అన్నారు. ఆర్థిక లావాదేవీలను డిజిటల్‌ విధానంలోకి మార్చేందుకు, ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామ న్నారు. రానున్న కాలంలో దేశంలో అన్ని రకాల పన్నులు రద్దై బ్యాంకింగ్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (బీటీటీ) ఒక్కటే ఉంటుందని, కరెన్సీ రద్దు ఉద్దే శం కూడా ఇదే అన్నారు. సాధ్యమైనంత త్వరలో తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయిలో డిజిటల్‌ విధానంలోకి వెళ్తుందని, నగదు రహిత ఆర్థిక లావాదేవీలు జరిపే రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. డిజిటల్‌ మిషనలో పూర్తిస్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ ఉద్యోగులకు దీనిపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. నగదురహిత విధానంలో భాగంగా మొదటి దశలో ప్రభుత్వంలో నడిచే ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్‌ విధానంలో నడిపించాలని, ప్రభుత్వానికి రిజిసే్ట్రషన్లు, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, ఇతర రంగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని, కాంట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగులకు జీతాలను ఈ-ట్రాన్సఫర్‌ విధానంలోనే చేపట్టాల ని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీలు చేపట్టేందుకు వీలుగా తెలంగాణ ఐటీ శాఖ స్వయంగా తయారు చేసిన టీఎస్‌ వాలెట్‌ను ఈనెల 14న కలెక్టర్ల సదస్సులో విడుదల చేయాలని ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదించారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. కాగా, ‘‘రాష్ట్రంలో ప్రస్తు తం ఎంత మందికి ఏటీఎం కార్డులున్నయ్‌. ఎంత మంది వాడుతున్నరు? ఎన్ని బ్యాంకులు ఎన్ని కార్డులు జారీ చేసినయ్‌? పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో ఎన్ని కార్డులున్నయ్‌? ఎన్ని వాడకంలో ఉన్నాయి!? తదితర వివరాలను బ్యాంకుల నుంచి సేకరించాలని సీఎంవో అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రస్తుత సమస్యలన్నింటికీ డిజిటల్‌ మనీ ట్రాన్సఫర్‌ ఒక్కటే పరిష్కారమన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *