Monday, 2 November 2026

దేవయానిపై వేటు

4

ఓ వార్తా ఛానెల్‌కు అనధికారిక ఇంటర్వ్యూ

బాధ్యతల నుంచి తొలగించిన విదేశాంగశాఖ

దిల్లీ, డిసెంబర్‌ 20(జనంసాక్షి): అభివృద్ధి భాగస్వామ్య విభాగంలో డైరెక్టర్‌గా పనిచేస్తోన్న దేవయాని కోబ్రాఘడేను ఆ బాధ్యతల నుంచి విదేశాంగశాఖ తొలగించింది. దేవయాని ఇటీవల అనధికారికంగా ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఇతర అంశాలపై మాట్లాడినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు విదేశాంగశాఖ వర్గాల సమాచారం. ఇంటర్వూలో దేవయాని మాట్లాడుతూ.. తన ఇద్దరు పిల్లలు అమెరికాలో జన్మించినందున వారు అదేశ పౌరులేనని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ విస్మయం చెందినట్లుగా తెలుస్తోంది. కాగా దేవయాని గత ఏడాది డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా న్యూయార్క్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమె సహాయకురాలి వీసాకు సంబంధించి తప్పుడు పత్రాలు ఇవ్వడం, వేదించడం వంటి ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు. ఆసమయంలో భారత, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత ఇబ్బందికి గురయ్యాయి. అనంతరం దేవయానిని భారత ప్రభుత్వం స్వదేశానికి రప్పించి అభివృద్ధి భాగస్వామ్య విభాగంలో డైరెక్టర్‌గా నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *