Tuesday, 3 November 2026

పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజలుల్లా హతం

2
ఆఫ్ఘన్‌లో 141 మంది తాలిబాన్ల ఖతం

ఇస్లామాబాద్‌,కాబూల్‌, డిసెంబర్‌20 (జనంసాక్షి):  పాక్‌ సైన్యం జరిపిన ద్రోణి దాడుల్లో పాక్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజులుల్లా హతమైనట్లు పాక్‌ విూడియాలో శనివారం విస్తృతంగా కథనాలు వచ్చాయి.  పెషావర్‌ లో ఇటీవల జరిగిన ఆర్మీ స్కూల్‌ పై తీవ్రవాదుల దాడిలో 148 మంది హతమైన ఘటనకు ఫజులుల్లానే సూత్రధారిని పాక్‌ ప్రభుత్వం భావిస్తుంది. పెషావర్‌ ఘటనపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్‌ – ఆఫ్ఘానిస్థాన్‌ సరిహద్దుల్లోని స్వాత్‌ లోయలోని తాలిబన్‌ స్థావరాలపై పాక్‌ సైన్యం ద్రోణి దాడులు చేసింది. దాడుల్లో ఫజులుల్లా మృతి చెందినట్లు తెలిపింది. ఇన్నాళ్లు ఫజ్‌లుల్లా గురించి తెలిసినా.. పట్టించుకోనట్టు ఉన్న పాక్‌ .. పెషావర్‌ దాడితో అప్రమత్తమయింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సైన్యం మిలిటెంట్‌ స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది.  ఈ నేపథ్యంలో ఫజ్‌లుల్లా స్థావరం గురించి పక్కాగా తెలుసుకున్న సైన్యం,..ద్రోణి దాడులతో మట్టుపెట్టినట్టు పాక్‌ విూడియా వర్గాలు వెల్లడించాయి.

తాలిబన్‌ ఉగ్రనవాదులపై ప్రపంచ దేశాలు యుద్దం ప్రకటించాయి. ఇప్పటికే పాకిస్తాన్‌ లోని తాలిబన్లపై ఆదేశ సైన్యం వరుస దాడులు చేస్తుండగా ఆప్ఘనిస్తాన్‌ లో కూడా మిలిటెంట్ల ఏరివేత మొదలయింది.శనివారం  ఆఫ్ఘానిస్థాన్‌ లో 141 మంది తాలిబన్‌ ఉగ్రవాదులను ఆదేశ ఆర్మీ అంతమొందించింది. గత నలభై గంటల నుంచి శనివారం ఉదయం వరకూ కొనసాగించిన ఆపరేషన్‌ లో భారీ స్థాయిలో తాలిబన్లు మృతి చెందినట్లు ఆఫ్ఘాన్‌ రక్షణ శాఖ సృష్టం చేసింది.  కునార్‌, నాన్‌ గార్హర్‌, ఘంజీ, హెల్మాండ్‌, ఉరుంగజ్‌, బాల్క్‌ తదితర ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్‌ లో 141 తాలిబన్లు మృతిచెందినట్లు పేర్కొంది. ఆపరేషన్‌ లో తాలిబన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు.  ఆయుధాలతో పాటు, బాంబులతో తాలిబన్లు  దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.  గత రెండు రోజుల నుంచి రోడ్డు ప్రక్కన తాలిబన్లు పాతిపెట్టిన 115 బాంబులతో పాటు మందుపాతరలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *