దేవినేని సైకిల్‌ యాత్ర

విజయవాడ,మే12(జ‌నం సాక్షి ): జైలుకెళ్లి వచ్చిన వాళ్లు మమ్మల్ని జైలుకు పంపిస్తామని అనడం విడ్డూరంగా ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో మంత్రి దేవినేని సైకిల్‌ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మైలవరం నియోజకవర్గంలో త్వరలో తాను పాదయాత్ర చేస్తానన్నారు. వైకుంఠపురం బ్యారేజీకి వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. 
ఈ బ్యారేజీ ద్వారా పులిచింతల వరకు నీరు నిల్వ చేస్తామన్నారు. సాగర్‌ కుడికాల్వ ద్వారా పల్నాడుకు, ఇతర ఎగువ ప్రాంతాలకు నీరిస్తామని చెప్పారు.

తాజావార్తలు