Monday, 2 November 2026

దేశంలోనే తెలంగాణ మోడల్ స్టేట్: కేటీఆర్

ktr

 హైదరాబాద్: తెలంగాణ రాష్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు మోడల్ స్టేట్‌గా నిలిచిందని మంత్రి కల్వకుంట్ల తారక రామరావు అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ రాష్ట్రంగా నిలుస్తూ అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ సంస్కరణలతో నవ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టామన్నారు. టీఎస్ ఐపాస్‌ను ప్రపంచమంతా ప్రశంసిస్తుందని తెలిపారు. సింగిల్ విండో విధానం ప్రపంచంలో ఎక్కడాలేదన్నారు. ఇవాళ ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. తెలంగాణకు పెట్టుబడులు రావని గతంలో దుష్ప్రచారం చేశారని విమర్శించారు. కేవలం రెండేళ్లలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని సాధించడాని అన్ని శాఖలు కృషి చేశాయని తెలిపారు. 22 శాఖలు కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కొత్తగా ఆన్‌లైన్ సర్వీసెస్‌ను లాంచ్ చేశామని పేర్కొన్నారు.

పారిశ్రామిక రంగంపై 60 సమావేశాలు నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పారీశ్రామీకరణ సరళతరం చేసేందుకు 26 చట్టాలను సరవించామని పేర్కొన్నారు. లేబర్ డిపార్ట్‌మెంట్ బాగా పనిచేసిందని కితాబిచ్చారు. లేబర్ డిపార్ట్‌మెంట్‌లో 22 సర్వీసులు మొదలుపెట్టామన్నారు. 26 చట్టాలను సవరించి కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. మొత్తం 380 అంశాలపై కేంద్రం సర్వే చేస్తే 324 అంశాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.

సంస్కరణల వల్ల లక్షా 61 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందన్నారు. అన్ని డిపార్ట్ మెంట్‌లన్నింటికి ఒకే రిజిస్ట్రేషన్ కిందకు తీసుకొచ్చామని తెలిపారు. 14 రకాలైన రిటర్న్స్ ఒకే రిటర్న్స్ కిందకు తీసుకొచ్చామన్నారు. పరిపాలనా ఫలాలను అవినీతిరహితంగా ప్రజలకు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఫార్మా రంగంలో పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మేరకు అభివృద్ధి సాధ్యమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *