హైదరాబాద్ డిసెంబర్ 12 (జనంసాక్షి) : : పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దేశీయ మార్కెట్ భారత్ అధికంగా ఆధారపడాలని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎగుమతుల ఆధారిత వృద్ధిరేటు విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుదలకు ఆర్‌బీఐ చేపడుతున్న చర్యలు స్థిరమైన వృద్ధి రేటును సాధించేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వంపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పన్ను విధానాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశీయ తయారీ రంగానికి వూతమిచ్చేందుకు కేంద్రం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతిపాదించిందన్నారు. భారత్‌లో తయారు చేయడంతోపాటు భారత్‌కోసం తయారు చేయడంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.
దేశియా మార్కెట్‌పై భారత్ ఆధారపడాలి – ఆర్‌బీఐ గవర్నర్





