రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ పౌరులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య శాశ్వతమైన బంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంపొందించేది రాఖీ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకత్వ స్ఫూర్తిని, సౌభ్రాతృత భావాలను బలోపేతం చేసే ఈ గొప్ప పండుగ సమాజంలో మహిళల రక్షణకు వారి సంక్షేమ వృద్ధికి బాటలు వేసేదిగా ఉండేలా ఈ రోజున మనమంతా సంకల్పం చెప్పుకోవాలన్నారు. దేశంలోని మహిళలు, అమ్మాయిలు అన్ని వేళలా సురక్షితంగా మనగలిగేలా మనమంతా ఈ పర్వదినాన సోదరభావాన్ని పెంపొందించుకుని వ్యాపింపజేయాలని చెప్పారు.
దేశ ప్రజలకు రాష్ట్రపతి రాఖీ శుభాకాంక్షలు




